PV Sindhus Korean Badminton Coach Kim Ji Hyun Resigns స్టార్ షట్లర్ సింధూ.. వరుస ఓటములకు కారణమిదేనా..? - PV Sindhus South Korean Coach Kim Ji Hyun Resigns Due To Personal Reasons- TV9 Telugu

PV Sindhus Korean Badminton Coach Kim Ji Hyun Resigns, స్టార్ షట్లర్ సింధూ.. వరుస ఓటములకు కారణమిదేనా..?
ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన భారత స్టార్ షట్లర్లు.. వరుసగా చైనా, కొరియా టోర్నీలలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. తాజాగా కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. గతవారం జరిగిన చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్, కొరియా ఒపెన్ తొలి మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. చైనా సంతతికి చెందిన అమెరికా అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌పై 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ కూడా కొరియా ఓపెన్‌లో ఓటమి చవిచూశాడు. డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్‌తో.. ప్రణీత్ కూడా తొలి రౌండ్ లోనే ఓడిపోయాడు. దీంతో కొరియా ఓపెన్‌లో సింధు, సాయి ప్రణీత్‌లు ఇంటి దారి పట్టారు.
పీవీ సింధూకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పీవీ సింధు విజేతగా నిలవడంతో క్రియాశీలక పాత్ర పోషించిన సహాయ కోచ్ కిమ్ జి హూన్ వ్యక్తిగత కారణాలతో తాజాగా రాజీనామా చేసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌‌కి ఇక 11 నెలల వ్యవధి మాత్రమే ఉండగా.. ఈ సమయంలో కిమ్ ఇలా రాజీనామా చేయడం పీవీ సింధూ ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దక్షిణ కొరియాకి చెందిన 45 ఏళ్ల కిమ్‌కి కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. 1989లో బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ గెలిచిన కిమ్.. ఆ తర్వాత 1994 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 1996, 2000 ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటిన కిమ్ 2001లో రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత కోచ్‌గా క్రీడాకారుల్ని తీర్చిదిద్దుతోంది.
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌షిప్‌ కోసం పీవీ సింధూ‌తో పాటు భారత షట్లర్లని సిద్ధం చేసే క్రమంలో గత కొన్ని నెలలుగా కిమ్ భారత్‌లోనే ఉండిపోయింది. అయితే.. ఇటీవల ఆమె భర్తకి గుండెపోటురాగా.. తాజాగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. కిమ్ తన భర్త దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుని కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కిమ్ రాజీనామాతో మరోవైపు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై అదనపు భారం పడనుంది. సింధూతో పాటు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ తదితరులకి శిక్షణ ఇస్తున్న గోపీచంద్‌కి ఇన్నిరోజులూ సహాయ కోచ్‌గా కిమ్ పనిచేసింది.
ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో తన టాలెంట్ చూపించిన సింధు.. ఇప్పుడు మాత్రం ఎందుకో తడబడింది. ఎన్నో ఓటముల తరువాత రికార్డు సృష్టించిన సింధు.. ఇప్పుడు తాజాగా జరిగిన మ్యాచ్‌లలో మళ్లీ అభిమానులను నిరాశపరిచింది.

Comments