Papaya Leaves In Dengue Fever డెంగ్యూ కాటుతో.. బంగారంలా మారిన బొప్పాయి.. - Dengue Is The Reason For Rise In Papaya Prices- TV9 Telugu
నిన్న ఉల్లి, నేడు బొప్పాయి ధరల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు 30, 40 రూపాయలు పెడితే దొరికే బొప్పాయి ఇప్పుడు వంద రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అసలు బొప్పాయి వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా..? ఈ పండుకి ఎందుకింత డిమాండ్ పెరిగింది..? తెలుసుకుందాం..
బొప్పాయి.. ఈ పండు తెలియని వారుండరు. సాధారణంగా గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ బొప్పాయి చెట్టు ఉంటుంది. చిన్న, పెద్దా తేడా లేదు అందరూ దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. గ్రామాల్లో ఫ్రీగా దొరికే ఈ బొప్పాయి నగరంలో చూద్దామన్న కనిపించడం లేదు. ఒక్కసారిగా బొప్పాయికి ఎందుకింత డిమాండ్ పెరిగింది అనుకుంటున్నారా..? మామూలుగా దీన్ని తినడానికి ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు మాత్రం మార్కెట్లను జల్లెడ పడుతున్నారు ఎందుకు అనుకుంటున్నారా..? దీనంతటికీ ఓ దోమ కారణం. అదేంటి.. బొప్పాయికి.. దోమకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? దోమ కాటు వల్ల నగర వ్యాప్తంగా డెంగ్యూ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోయింది. డెంగ్యూ ఫీవర్ సోకితే ప్లేట్‌లెట్ల సమస్య తలెత్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల సమస్య పోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పుడూ లేనంతగా బొప్పాయికి డిమాండ్ పెరిగింది. కూరగాయల ధరలతో పాటు, పండ్ల ధరలు కూడా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏం కొనలేం, తినలేం అన్నట్లు తయారైంది పరిస్థితి.
డెంగ్యూ ఫీవర్ వ్యాపించడంతో బొప్పాయి రేటు ఆకాశాన్ని తాకుతోంది. మార్కెట్లతో రూ.100 పెట్టినా బొప్పాయి దొరకడం లేదు. మరోవైపు వీటి పంట కూడా తక్కువగా పండించడంతో మార్కెట్లలో బొప్పాయి కొరత ఏర్పడింది. ఒక కాయ దొరికితే చాలు బంగారమే అన్నట్లు ఉంది పరిస్థితి. అమ్మకందారులు మాత్రం ఇదే అదునుగా రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు.
బొప్పాయి పండులో ఉంటే విటమిన్లు.. వేరే ఏ పండులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం 14 ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజు దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. బొప్పాయిలో విటమిన్ A,B,C,D,E లు అధికంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో ఒక్కసారిగా బొప్పాయి పండుకు డిమాండ్ పెరిగింది. మరోవైపు డెంగ్యూ వ్యాపించడం కూడా దీనికి ప్రధానం కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
For more information go for this link :https://tv9telugu.com
Comments
Post a Comment