భూతాపం నగరాలను ముంచేయనుందా ? - indian rivers are under sinking threat himalayan rivers to dried up sea levels to increase- TV9 Telugu

indian rivers are under sinking threat himalayan rivers to dried up sea levels to increase, భూతాపం నగరాలను ముంచేయనుందా ?
రోజు రోజుకూ పెరిగిపోతున్న భూతాపం భవిష్యత్తులో పెను విపత్తును సృష్టించబోతున్నది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల శాపంగా మారుతున్నాయి. ఫలితంగా హిమాలయాలు వేగంగా కరుగుతున్నాయి. దాంతో హిమానీనదాలైన గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదులతోపాటు చిన్న చితకా నదులన్నీ ప్రవాహాలను పెంచుకుంటున్నాయి. ఫలితంగా నదుల ద్వారా సముద్రాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఇది భవిష్యత్తులో భూమికి ముంపు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ప్యానెల్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుండడంతో ఈ నివేదికకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న భూతాపం హెచ్చరికలను పలు దేశాలు బేఖాతరు చేయడంతో పరిస్థితి చేయి దాటి పోతున్న సంకేతాలు విస్పష్టం అయ్యాయి. ఈ క్రమంలో భారత దేశంలో జీవ నదులైన గంగ, యమునా, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, కృష్ణ, కావేరి నదులు క్రీ.శ.2100 నాటికి పూర్తిగా ఎండిపోయి ఆ నీరంతా సముద్రాల్లోకి చేరే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గంగ, యమునా వంటి నదులు అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఇక్కడ నదుల అంతర్థానం ఒక్కటే సమస్య కాదు. సముద్ర మట్టానికి చేరువలో ఉన్న, నగరాలను కూడా సముద్ర జలాలు ముంచేయనున్నాయన్నది ఐపీసీసీ నివేదికలో ఆశ్చర్యానికి, భయాందోళనకు గురిచేసే అంశం. దేశ వాణిజ్య రాజధాని ముంబైతో పటు చెన్నై, కోల్కతా, సూరత్ నగరాలు 2100 సంవత్సరం నాటికి సముద్ర ముంపునకు గురి అవుతాయన్నది ఐపీసీసీ నివేదికలో షాకింగ్ ఎలిమెంట్.
indian rivers are under sinking threat himalayan rivers to dried up sea levels to increase, భూతాపం నగరాలను ముంచేయనుందా ?indian rivers are under sinking threat himalayan rivers to dried up sea levels to increase, భూతాపం నగరాలను ముంచేయనుందా ?
ఈ నాలుగు ప్రధాన నగరాలు మునిగిపోతున్నాయనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. అంటే మరో 80 ఏళ్లలో ముంబై, చెన్నై,కోల్కతా, సూరత్ నగరాలు ప్రపంచ పాఠం నుంచి అంతర్ధానం అవుతాయన్న మాట. వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్నా.. భూతాపం ఇంతలా పెరిగిపోవడం అత్యంత ప్రమాదకరమైన అంశం. భూతాపాన్ని తగ్గించే చర్యలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోతే మరింత ఉపద్రవాన్ని భవిష్యత్ తరాలు చవి చూడాల్సి వస్తుంది. అది ప్రళయాలకు దారి తీసి, భూమి అంతరించి పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే భవిష్యత్ తరాలకు ఏమైనా మాకెందుకు అనే ధోరణి విడనాడి.. భూతాపం తగ్గే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ బాధ్యత కేవలం ప్రభుత్వాలదే అనుకుంటే నష్టం జరిగేది మనకే. అందుకే పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతీ ఒక్కరిది. ఇది గుర్తిస్తేనే మానవాళి పెను ముప్పు నుంచి కొంతైనా తప్పించుకోగల్గుతుంది.. భూ ప్రళయం కొన్ని శతాబ్దాల పాటైనా వాయిదా పడుతుంది.. తస్మాత్ జాగ్రత్త !!
For more information go for this link :https://tv9telugu.com

Comments