Here is the list of three candidates in AP Congress presidential raceఏపీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త సారథి.. అధ్యక్ష రేసులో ఆ ముగ్గురు..? - TV9 Telugu Here is the list of three candidates in AP Congress

Here is the list of three candidates in AP Congress presidential race, ఏపీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త సారథి.. అధ్యక్ష రేసులో ఆ ముగ్గురు..?
గత ఆరేళ్లుగా ఏపీలో అతలాకుతలం అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సారథిలేని రథంలా అయిపోయింది. దాంతో చుక్కాని లేని నావలా ఆ పార్టీ నేతలు తలో దారి చూసుకుంటున్నారు. దానికి తోడు ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రఘువీరారెడ్డి తనకు సొంత పనులే ముఖ్యమంటూ పార్టీ బాధ్యతలకు ససేమిరా అంటున్నారు. ఢిల్లీ పెద్దలు స్వయంగా కోరినా అయన మెత్త బడలేదు సరికదా పార్టీ నేతలకు అందుబాటులో కూడా లేకుండా బెంగళూరులో మకాం వేసి, బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో రఘువీరా కమలం పార్టీలో చేరతారని.. విద్యార్ధి దశలో అయన ఏబీవీపీలో పని చేయడం వాళ్ళ అక్కడ ఈజీగా సర్దుకోగలరని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని రఘువీరా.. స్పెక్యులేషన్స్ ని ఖాతరు చేయకుండా బిజినెస్ వ్యవహారాలకు పరిమితం అయ్యారు.
ఇక రఘువీరాతో లాభం లేదన్న నిర్ధారణకు వచ్చిన ఏఐసీసీ పెద్దలు.. ఏపీసీసీ అధ్యక్ష బాధ్యలను స్వీకరించే సమర్థుని వేట ప్రారంభించారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది.. బాగా లాభపడిన వారెవరూ తాజాగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అస్సలు బాగాలేదన్న కారణంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా లేరని సమాచారం.
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, చిత్తూర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్‌లు ఆ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. అయితే వీరిద్దరి అభ్యర్థిత్వాన్ని పార్టీలో అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.
మరో వైపు ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పీసీసీ మాజీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలసి విన్నవించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును ఎంపిక చేయాలని భావిస్తున్నా ఆయన సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీకి అధిష్టానం సూచించింది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికీ ఏపీసీసీకి ఒక సారథిని ఎంపిక చేయాలన్న కృత నిశ్చలయంలో ఏఐసీసీ నేతలున్నట్టు సమాచారం.
For more information go for this link :https://tv9telugu.com

Comments