Chintamaneni Prabhakar Case Updatesచింతమనేని కేసుల చిట్టా.. విప్పితే చాంతాడంత..! -Chintamaneni Prabhakar Case Updates
చింతమనేని ప్రభాకర్.. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూడా.. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ ఎమ్మెల్యే… ఇప్పుడు కటకటాలపాలయ్యారు. అంతేకాదు… గతంలో చేసిన ఒక్కో కేసు ఇప్పుడు అతన్ని వెంటాడుతున్నాయి. ఈయనపై 1995లోనే ఏలూరు పోలీసు స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.
అయితే ఈ ఎమ్మెల్యే గారు.. గత 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. మహిళా అధికారులపై కూడా దాడులకు దిగిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడ అనేక సందర్భాల్లో ప్రభుత్వాధికారులపై చేయి చేసుకున్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు అప్పట్లో. అయితే 2014 నుంచి అధికారంలో టీడీపీ ఉండటంతో.. ఈ ఎమ్మెల్యేను టచ్ చేయడానికి పోలీసులు కూడా ధైర్యం చేయలేక పోయారు. అయితే ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్న సమెత.. ఈ చింతమనేని వ్యవహారంలో నిజమనిపిస్తోంది.
అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా.. ఆయన స్టైల్ మాత్రం ఏమాత్రం మారలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో పాటు తాను కూడా చిత్తుగా ఓడినా.. తన వ్యవహార సరళిని ఎంతమాత్రం మార్చుకోలేదు. చింత చచ్చినా.. పులుపు చావదు అన్నట్లు.. అధికారంలో టీడీపీ లేకున్నా.. చింతమనేని గారు.. ఏమాత్రం తగ్గలేదు. మరోసారి దళితులను కులం పేరుతో దూషించారన్న కేసులో ఇరుక్కుపోయారు. అంతేకాదు.. అదే కేసులో చింతమనేని జైలుపాలయ్యారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని చింతమనేని దాఖలు చేసుకున్న పిటిషన్ ను బుధవారం ఏలూరు కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ షాకిచ్చింది.
బుధవారం బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా పోలీసులు చింతమనేనిని ఏలూరు లోని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 9 వరకూ చింతమనేని రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దళితులు దూషించిన కేసు మాత్రమే కాకుండా చింతమనేనిపై కేసు పెట్టిన వారిని చంపుతానని హెచ్చరించారని మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వరుస కేసులను ఎదుర్కొంటున్న చింతమనేనిని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు కూడా నిరాకరించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనపై గతంలో నమోదైన కేసులను కూడా తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా నలభైకి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింట్లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తించడం వంటివి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్ధాం.
చింతమనేని ప్రభాకర్ మీద నమోదైన కేసులు, రౌడీ షీట్ల వివరాలు..
* 1995లో ఏలూరు పోలీస్ ష్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్..
1. ఎఫ్ఐఆర్: 87/2008, క్రైం నం: 130/07.
సెక్షన్లు: 304(ఏ), 201, 182
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 304(ఏ), 201, 182
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
2. ఎఫ్ఐఆర్:: 443/2011, క్రైం నం: 290/10.
సెక్షన్లు: 447, 427 రీడ్ విత్ 34 అండ్ 3(1).
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 447, 427 రీడ్ విత్ 34 అండ్ 3(1).
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
3. ఎఫ్ఐఆర్:: 166/13, క్రైం నం: 137/10.
సెక్షన్లు: 143, 448,342
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 143, 448,342
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
4. ఎఫ్ఐఆర్: 36/2011, క్రైం నం: 90/11.
సెక్షన్లు: 354, 341, 352, 352 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 354, 341, 352, 352 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
5. క్రైం నం: 218/2011.
సెక్షన్లు: 353, 323, 506(2), 352 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
సెక్షన్లు: 353, 323, 506(2), 352 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
6. క్రైం నం: 84/12.
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి..
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి..
7. క్రైం నం: 172/12.
సెక్షన్లు: 341, 353, 506(2) రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
సెక్షన్లు: 341, 353, 506(2) రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
8. క్రైం నం: 20/13.
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 11.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
సెక్షన్లు: 341, 323, 324 రీడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 11.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
9. క్రైం నం: 29/13.
సెక్షన్లు: 341, 332, 353 రీడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 3(1) ఎస్సి, ఎస్టీ యాక్ట్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 341, 332, 353 రీడ్ విత్ 34 IPC అండ్ సెక్షన్ 3(1) ఎస్సి, ఎస్టీ యాక్ట్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
10. క్రైం నం: 157/13.
సెక్షన్లు: 403, 406 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 403, 406 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
11. క్రైం నం: 160/13.
సెక్షన్లు: 448, 323, 307 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 448, 323, 307 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
12. క్రైం నం: 263/13.
సెక్షన్లు: 448, 427, 506 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
సెక్షన్లు: 448, 427, 506 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
13. క్రైం నం: 77/14.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
14. క్రైం నం: 80/14.
సెక్షన్లు: 353, 341 171 E, 171-F, 188, 506 మరియు ప్రజా ప్రతినిదుల రక్షణ యాక్ట్ సెక్షన్ 132(1)(2), 132(1)(2)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
సెక్షన్లు: 353, 341 171 E, 171-F, 188, 506 మరియు ప్రజా ప్రతినిదుల రక్షణ యాక్ట్ సెక్షన్ 132(1)(2), 132(1)(2)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
15. క్రైం నం: 77/14.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
సెక్షన్లు: 353 మరియు సెక్షన్ 4 (మెడికల్ సర్వీసెస్ యాక్ట్ 2007)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు టు టౌన్.
16. ఎఫ్ఐఆర్: 356/07, క్రైం నం: 93/2006.
సెక్షన్లు: 341, 188 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: గన్నవరం.
సెక్షన్లు: 341, 188 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: గన్నవరం.
17. ఎఫ్ఐఆర్: 467/10, క్రైం నం: 39/2009.
సెక్షన్లు: 309 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: 309 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
18. ఎఫ్ఐఆర్: 549/10, క్రైం నం: 210/2009.
సెక్షన్లు: 143, 341, రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
సెక్షన్లు: 143, 341, రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదవేగి.
19. ఎఫ్ఐఆర్: 915/2011, క్రైం నం: 46/2011.
సెక్షన్లు: పక్షులు, జంతు హింస, పక్షులతో పందాలు చట్టం 9(2), 11
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
సెక్షన్లు: పక్షులు, జంతు హింస, పక్షులతో పందాలు చట్టం 9(2), 11
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
20. ఎఫ్ఐఆర్: 27/12, క్రైం నం: 100/11.
సెక్షన్లు: 143, 341, 186 రెడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు గ్రామీణ.
సెక్షన్లు: 143, 341, 186 రెడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు గ్రామీణ.
21. ఎఫ్ఐఆర్: 233/12, క్రైం నం: 161/11.
సెక్షన్లు: 341 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
సెక్షన్లు: 341 రీడ్ విత్ 34 IPC.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
22. ఎఫ్ఐఆర్: 377/13, క్రైం నం: 124/13.
సెక్షన్లు: 143, 341 రీడ్ విత్ 34 IPC మరియు 7(1)(b),
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదపాడు.
సెక్షన్లు: 143, 341 రీడ్ విత్ 34 IPC మరియు 7(1)(b),
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: పెదపాడు.
23. క్రైం నం: 159/12.
సెక్షన్లు: 143, 341, 149 రీడ్ విత్ 34 IPC మరియు 7(1)(b),
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: హనుమాన్ జంక్షన్.
సెక్షన్లు: 143, 341, 149 రీడ్ విత్ 34 IPC మరియు 7(1)(b),
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: హనుమాన్ జంక్షన్.
24. సెక్షన్లు: 506, 323, 356 రెడ్ విత్ 34 IPC మరియు 7(1)(b). (ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
25. సెక్షన్లు: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ఏలూరు త్రీ టౌన్.
26. సెక్షన్లు: 353, 334, 379 (ఎమ్మార్వో వనజాక్షి గారి మీద దాడి)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ముసునూరు.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: ముసునూరు.
27. సెక్షన్లు: 323, 353,506 (ట్రాఫిక్ పోలీసు మీద దాడి)
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: దెందులూరు.
28. సెక్షన్లు: 27, 29, 51 వ్యణ్యప్రాణి అభయారణ్య చట్టం-1972
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: కైకలూరు.
కేసు నమోదైన పోలీస్ ష్టేషన్: కైకలూరు.
29. హనుమాన్ జంక్షన్లో ఆర్టీసి కండక్టర్, స్తానికుడిని కొట్టిన కేసు
… ఇలా దాదాపు మొత్తం 40 కేసులున్నాయి.
For more information go for this link : https://tv9telugu.com
Comments
Post a Comment